విశ్వనాధ గారి ఉవాచ
>>>కవి సన్మానమంటే కనకాభిషేకం,గండపెండేరం,ఏనుగు నెక్కించుటయు,ఈ మూడు లేకుండా ఈ దేశములో ఏ కవి సన్మానము జరుగుచున్నట్లు లేదు. ఈ దేశమునకు వెర్రి ఎక్కినట్లు వున్నది.మీ కిష్టమైన కవిని పిల్చి మీకున్న పలుకుబడిని బట్టి డబ్బు సంపాదించి వాని అదౄష్టము కొలది డబ్బు నిండు. కనాభిషేకము,గండపెండేరము పర్తి కవికీ చేయరాదు,వేయరాదు.
>>>ఆంధ్ర దేశంలో ఇప్పుడు సాహిత్యం అందరికి fancy గా తయారైంది.అంతే తప్ప గట్టిగా పని చేద్దాం అని ఎవరు అనుకోటంలేదు.ఒప్పుకున్నా ,ఒప్పుకోకపోయినా అచ్చంగా fancy girl స్థితి సాహిత్యానికి పట్టింది.
>>>మనం రోజు మాటాలడుకొనుచున్నట్లే కవిత్వం కూడా చెప్పినచో వేరే కవిత్వం ఎందులకు?మన మాటలు చాలవా?
>>>ఇంగ్లీషు ద్వారా సంస్కౄతం చదువుకోవటం హోటల్ తిండి వంటిది.ప్రాచీన పద్దతిలో చదువుకోవటం తల్లి పెట్టిన తిండి వంటిది.
>>>మనలో బ్రాహ్మణత్వం తగ్గినట్టే ఆంగ్లం ద్వారా అభ్యసించే సంస్కౄతంలో సంస్కౄతత్వం కూడా తగ్గిపోతుంది.
>>>కవితవం తెలియడం లేదు అంటే ఆర్ధిక శాస్త్రంగానీ,గణిత శాస్త్రం గానీ అందరికీ తెలుస్తున్నయాని నేనడుగుతున్నాను..అలాగే అన్నీ విద్యలే, అన్ని శాస్త్రాలే,కవిత్వం కూడాను.(తెలియాలి అంటే చదవాలి,వినాలి,అధ్యయనం చెయ్యాలి,అభ్యసించాలి మరి )
>>>కళ్యాణాత్మకమైన "విష్ణు కధలు" అనే పోతన గారి పద్యాన్ని అయిదేండ్లప్పుడు నా తండ్రి నాకు చెప్పినా అరవైరెండేండ్లు దాటితే కాని నాకు దానియొక్క నిజమైన అర్ధం బోధనపడలేదు.ఒకానొక భావం అర్ధం కావలి అంటే మనం బ్రతికుండగా అర్ధం కాక పోవచ్చు. అది అర్ధమయ్యేవరకు మనం బ్రతకలేకపోవచ్చు.
>>>అంధ్రదేశంలో నాటకాలు అధోగతి పాలయిపోయినాయి.rehearsal లేకుండా ఒక నటుణ్ణి ఇంకొక నటుడు ఎరగకుండా నాటకాలు ఆడుతున్నారు. పాశ్చాత్య దేశాలలో ఒక్కోక్క నాటకము రెండు వందల సార్లు అయినా rehearsal చేస్తారు. ఆంధ్ర దేశంలో నాటకాలు ఆడబోయే ముందు రోజు సాయంత్రమయినా ఒక్క సారి నల్గురు నటులు సంప్రదించయినా సంప్రదించుకోరు.
>>>సంస్కౄతము తెలిసిన వారినే తెలుగు పండితులుగా నియమించటం మంచిది.ప్రస్తుతం నూటికి ముప్పై యైదు మార్కులు వచ్చిన వారిని తెలుగు పండితులుగా నియమించటం,వారివద్ద నున్న శిష్యులు నూటికి ముప్పై యైదు వచ్చి కౄతార్ధులు కావటం వల్ల విద్యార్ధులలో విద్య క్షీణించిపోతుంది.(భాష హరించి పోతుంది)
>>>సంపూర్ణ కావ్యం ఒక్క రామాయణం.దానిలోని విశేషాలను అల్పగ్ఞుడగు నేను నాకు తెలిసినంతవరకు చెబితేనే ఐదారు దినాలు పడుతుంది.ఇక్కడ వున్న పండితులు అంతా ఎంత కాలం అయినా చెప్పగలరు.
>>>తెలుగు మాగాణి పల్లెటూరి జీవితంలో శోభ తెలియని వాడికి నా కావ్య సంపద తెలియదు.అక్కరలేదు.
>>>మన భాష మనకి కావలి అంటే మూడవ తరగతి లోనే ఇంగ్లీషు మొదలెట్టకండి మహాప్రభో! మన ఆడవాళ్ళకి ఇంగ్లీషు వస్తే పిల్లలకేం వస్తుంది? వేలా పాళా లేకుండా భూపాల రాగం అన్నట్టు వుంటుంది
>>>చంపండి,చీరండి,చండాడండి అంటేనే సాహిత్యమా?లేక అనేకానేక చిత్ర విచిత్రములైన రాజకీయాలను కవిత్వాలతో పులిమితే కవిత్వమా? ప్రతి తల మాసిన వాడు ఇది సాహిత్యం,ఇది కాదు అంటే ఒప్పుకోని తీరాల్సినదేనా?
>>>మన సాహితీ సంస్కౄతులు ఇప్పుడు మన వద్ద లేవు.అవి చిన్నభిన్నమయి విచ్చిన్నమై విడివిడిగా పురాతన వస్తు ప్రదర్శనశాలల్లో,పాత గ్రంధాలయాల్లో మాత్రమే కనిపిస్తాయి.
>>>మీ కవిత్వం అర్ధం కావటం లేదు అన్నరు త ఒకాయన విశ్వనాధ వారితో.నాది అర్ధం కాకపోతేకావచ్చు.కాని అర్ధం అయ్యేదంతా కవిత్వమా?అని అన్నారుట విశ్వనాధవారు
>>>కావ్యాన్ని అర్ధం చేసుకోవటం అందరికీ అందుబాటులో వుండే విషయం కాదు.అది కొందరికి మాత్రమే వుంటుంది.కొందరికి అసలు ఏదీ అర్ధం కాదు.వరిది వారికే అర్ధం కాదు,వారు వారికే అర్ధం కారు.కవిత్వం ఆ కాలం వరికి అర్ధమయ్యేది.వరికి తెలుగు తెలుసు.వాక్య నిర్మాణ వైఖరి బహు విచిత్రమైనది.యి వైచిత్రిలోని విశిష్టత తెలియని వారికి,తెలిసీ తెలియని వారికి కావ్యం ఏలా అర్ధం అవుతుంది.?
>>>ఈనాడు వ్యవహారిక భాషలో గ్రంధాలు రాయాలన్న ఉబలాట,ప్రచారం ఎక్కువైపోతుంది.ఆ భాషలో ఏది వ్రాయాలో,ఏది వ్రాయకూడదో,ఏది వ్రాయవచ్చో, తెలియదు.దానికి చెందిన సాధన,పరిశోధన లేదు.భాషలు ఎన్ని తీర్లో,ఎందుకో తెలియదు.భాషణ భాష,సంభాషణ భాష ఒకే తీరు వుండాలి అను వదనలాంటిది ఇది.దీనివలన నేడు మన భాష సగానికి సగం చచ్చిపోయినది.
>>>పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు నా రామాయణాన్ని మెచ్చుకోవటం లేదనిన విచారం నాకేమి లేదు.వాళ్ళు దాన్ని చదివి మనసులో తప్పకుండా మెచ్చుకుంటారు. పైకి చెప్పటానికి జంకుతారు.చెప్పరు.దానివల్ల వారికేమి లాభం లేదు కాబట్టి.
>>>ఒకడు ఎదో రాసి ఇది కొత్త కవిత్వం అనును.అది ఒక పాటకాదు,బాటా కాదు.తన కిష్టమైన దేదో ఒక మాట.ఒకటేదో కాదనాలి,ఒకరినెవరినో నిందించాలి, అది మంచైనా,చెడ్డైనా ఏదో ఒక కొత్త రాస్తా తొక్కాలి,తోచిందో,తోయందో ఏదో ఒకటి కక్కాలి.అదీ వరస.అతనికి తెలియదు సవ్యమైనది అంతా ఎప్పటికీ నవ్యం కూడ అవుతుంది అని కానీ నవ్యమైనది అంతా సవ్యం కాక పోవచ్చునని.
>>>పాపం !భర్తౄహరి "సర్వవిదాం సమాజే విభుషణం మౌన మపండితానాం" అన్నాడు.అనగా పండితుల సభలో అపండితుడు మాట్లాడకుండా ఉరుకోవటం మంచిది అని దాని తాత్పర్యం.ఇప్పుడు దానికంతా వ్యతిరేకం.పండితుడు మాట్లాడకుండా వుంటే మంచిది.
>>>నేటి సంగీతం చెప్పనె యక్కరలేదు.అది కళకాదు గదా !పరిశ్రమ.కళ కళ కొరకు కాదు లాభం కొరకు చేసెడిది
>>>పద్యం అర్ధం కాక పోతే పూర్వకాలంలో పఠితది తప్పు అనేవారు.నేడు కవిది తప్పు అంటున్నారు.