చరిత్రలో ఈ రోజు
quoting old post
కానీ....
ఇప్పుడు నాయకులే తెచ్చిన యమ లోకం
ధన దాహ సంగ్రామం
పీల్చేది పేదల రక్తం
పేదవాడి గుండెలో అక్రోశం
బతుకే భయంకరం
కాన రాని సుజలాం సుఫలాం సస్యశ్యామలాం
నిరుపమానమైన వీరుల త్యాగం
ఇదో మాయ ప్రపంచం Read more...
"కళ్ళు తెరిస్తే జనన౦ ...కళ్ళు మూస్తే మరణ౦ ...ఇదే కదా పయన౦" యీ మధ్య లో.... మిధ్య లో... నా అన్వేషణ
తెలుగు విమర్శకుడికి తిట్టతంలో వున్న ప్రజ్ఞ మెచ్చుకోవడంలో లేదు.వేలెడంతేసివాడు జానెడంతేసివాణ్ణి చూసి,మూరెడంతేసివాళ్లున్నారు లేవోయ్ అంటాడు .తెలుగు విమర్శకుడానా అన్నాను?తెలుగు వాడన్న ప్రతి వాడికీ ఉన్న గుణమే అది.సినిమాకు వెళ్ళి ఈసడిస్తాడు.విందుకు వెళ్ళి వెక్కిరిస్తాడు
తెలుగు వాడికి సరియైన విమర్శప్రమాణ్యాలు లేకపోటమే ఇందుకు కారణమనుకొంటాను.గొర్రెలను తినేవాడెప్పుడూ ఉంటూనే ఉంటాడు.కాబట్టి కోళ్ళని తినే వాణ్ణి మెచ్చుకోనక్కరలేదన్నదే ఇతని వాదం అనవచ్చును.తెలుగు వాళ్ళలో పైకివచ్చిన వాళ్ళంతా పైకి పొయిన వాళ్ళే.
అయితే తెలుగు వాడిలో ఒక దుర్మార్గం మాత్రం లేదు.ఏదో ఒక కసి మనసులో పెట్టుకొని ఎవరినీ ఇతగాడు తిట్టడు.కేవలం ఈపనిని నిష్కా మకర్మగానే నిర్వహిస్తాడు.దుమ్మెత్తిపోయడం తెలుగువాడికి (ఇంగ్లీషులో చెప్పాలంటే) "ద్వితీయ ప్రకౄతి".
ఫలానా కవి చాలా మంచి పద్యాలు రాస్తాడని నువ్వంటే,వెంటనే మన తెలుగు వాడు పోనిద్దూ వాడు ఒక కవేనా అంటాడు.జాగ్రత్తగా గమనించాలి ఈ మన తెలుగు వాడు ఏదో ఒక ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటాడు.కవిత్వం జోలికికెప్పుడూ వెళ్ళిన పాపానపోయి ఉండడు .కాని తన అముల్యాభిప్రాయాన్ని జంకూ బొంకూ లేకుండా వెల్లడించి తీరుతాడు. నాకు తీరుబాటంటూ లేకపోతోంది కాని లేకపోతేనా దాని తాతలాంటి కావ్యం రాసిపారేద్దును అనే అభిప్రాయం అతని మనస్సులో ఎక్కడో అట్టడుగున పొడుస్తూనే ఉంటుంది.కాని ఆ మాట మాత్రం ఎప్పుడూ పైకి అనడు.
అలాగే మన ఆంద్రుడు తనకు తీరుబాటంటూ దొరికితే ఎన్నో చలనచిత్రాలు తయారుచేసేవాడు.అనవసరంగా గుజరాతీవాళ్ళతో పోటీ ఎందుకని పరిశ్రమ జోలికి పోలేదు.లేకపోతేనా?తాను ప్రారంభించినవే కదా పరిశ్రమలన్నీ-తీరుబాటు లేక ఆంధ్రేతరులకు అప్పగించేశాడుగాని.
ఇదో చిత్రం.తెలుగువాడు తానే అన్ని ఉద్యమాలను ప్రారంభించానని చాటుకుంటాడు.ప్రారంభం తనదయితే చాలు,అది తక్షణం ఆగిపోయినా బెంగలేదు మనవాడికి.మొదటి చలనచిత్రం ,మొట్టమొదటి ప్రత్యేక రాస్ట్రాందోలన ప్రజల బాష కోసం మొదట ఘోషపెట్టడం,ప్రప్రధమంలో సూటు తొడిగిన ఆంధ్రుడు-మున్మ్ముందుగా ఆటంబాంబును నేనే కనిపెట్టానని నేడో రేపో ఎవడైనా ఆంధ్రుడు స్టేట్ మెంటు ఇస్తే నాకేమీ ఆశ్చర్యమనిపించదు.
స్పర్ధకు బదులు సహకారం,అహంకారనికి బదులు ఆత్మనిగ్రహం ,వైముఖ్యానికి బదులు సౌముఖ్యం ఇవి మనకు కావలసినది. ఆంధ్రదేశంలోని అగ్రనాయకులలో వీటిని సకౄత్తుగా చుస్తాము.యువకులతరంలోనైనా ఇవి సమౄద్దిగా వికసిస్తే ఆంధ్రదేశంలో ప్రజాజీవితం ఫలిస్తుందని చెప్పుకోవచ్చును
చలం పుస్తకాలని చదవకుండానే/అవి అర్దం కాకుండనే నువ్వు చేస్తె నవ్వటం టప్ప ఏమీ చెయ్యలేను :) చలం మనవారలు ఏం అన్నారు?ఎందుకు అన్నారు అనేది ఒక లో తేలేది కాదు.సాహిత్యాన్ని చదవాలి /ఆ రచనల వేంక హౄద్యం అర్ధం చేసుకోటం కి ప్రయత్నించాలి .ఏవి చెయ్యకుండా వఖితగి దూషనలు చేస్తాం అంటే మరో చిరునవ్వు :) అబ్రకదబ్ర కోసం సాహిత్యన్ని చదవటం /కోసం రచయితలు నచ్చటం అనేది మొదటి సారిగా చూస్తున్న మన లే అర్దం కాని /లెని పదాలు ఇంక శైలి గురించి మట్లాడటం హాస్యాస్పదం. చలం శైలి .... బాధ పడాలి !నలగాలి ! జీవిత రధ చక్రాల కింద కలంలోంచి నెత్తురు వొలకాలంటే అక్షరాల?పాండిత్యమా ? కాదు సంవత్సరాల మూగవేదన అంధకారమో అన్వేషణ దిక్కులేని దుర్భలుల జీణావేసం ఎవరితోనూ చెప్పుకోలేని అధమ చారిత్రల గర్భశొకం- యిదీ నా శైలీ ! చలం
ఒకప్పుడు ధనవంతులని ద్వేషించాను.నా ప్రతి రక్తం కణం లో ను అసూయ నిండి వుండేది .అవును మరి- కోటాను కోట్ల మంది ఆకలి మంటల్లో అలమటిస్తుంటే వాళ్లు సర్వ సుఖాలు అనుభవిస్తున్నారు !యీ సిద్ధాంతం మీదనే నేను ధనికులని ద్వేషించాను.
ఆ రోజులలో నేను ఎన్ని బాధలు పడ్డాను !నా పద్దెనిమిదో యేట మా తల్లి తండ్రులు గతించారు .నా చెల్లెలు నాకంటే మూడేళ్ళు చిన్న.అప్పటికి పెళ్లి కాలేదు. మా బ్రతుకు భారం నా నెత్తిన పడింది. తండ్రి ఆస్తి గా ఓ పూరి కొంప తప్ప మాకేమీ లేదు .
ఒక ఫ్యాక్టరీ సామాన్య గుమాస్తా పనికి కుదిరాను.నెలకు పదిహేనురూపాయలు జీతం.దానితో జీవించాలి.ఎప్పుడయినా అస్వస్థత వల్ల పని మానితే సంపాదన కురచ అయ్యేది .
తక్కువ రకపు ఆహారానికి అలవాటు పట్టం మాకెంతో కాలం పట్టలేదు. అదే ఇంత దుస్థితి లోపర్వదినాన ఏమైనా వండి పిండి వంట చేసేది చెల్లి. అమితానందం తో భుజించే వాడిని .ఒక్కో సారి దుస్తులు చినిగి ఎంతో భాదపడేవాళ్ళం కొనటానికి .దుప్పటి కొనాలి అంటే డబ్బు వుండేది కాదు.అంగవస్త్రం మొలకుచుట్ట కట్టుబట్ట కప్పుకోనేవాడిని. దానితోనే సంతృప్తి కలిగేది ,తప్పదు మరి.
ఇంత దుస్థితి లో వుండి కుడా చదువంటే చెవికోసుకొనే వాణ్ణి,చదవటానికి గ్రంధాలు ఎలా వస్తాయి?కనీసం పత్రికలూ కొనటానికి కూడా డబ్బు వుండేది కాదు.ఏనాడయినా ఫ్యాక్టరీలో అదృష్టవశాత్తు రాత్రి పని లభిస్తే అమితానందం కలిగేది.ఆ డబ్బుతో సాహిత్యం కొనేవాణ్ణి.అంత కష్టపడి కొన్న పుస్తకాలు,పత్రికలూ కావటం చేత ఎంతో శ్రద్దగా చదివేవాణ్ణి.
అప్పుడప్పుడు స్టాలు కి పోయి గ్రంధాలు తిరగవేసేవాణ్ణి.స్టాలు గుమాస్తాలు కోపం వచ్చేది "పో పొమ్మ"ని కసిరేవాడు.సిగ్గుపడే వాణ్ణి కాదు.పేదవాడికి సిగ్గు ఎందుకు ?ప్రాధేయ పడి అతని మనసు కరిగించి,సాహిత్యాన్నిచవిచూసే వాణ్ణి.
ఒక సారి స్టాలులొ ఒక గ్రంధం చూసాను .తొలి పేజీ చూడటం తోనే అది అమూల్యమైనదని గుర్తించాను కాని... కొనటమెలా ? పదిరోజుల సంపాదన యిచ్చుకోవాలి.
చెల్లి తో సంప్రదించాను.ఆ గ్రంధాన్ని భూమ్యాకాశాల చెల్లి దగ్గర స్తుతించాను.తత్ఫలితం గా ఆ నెల కొనవలసిన చొక్కాగుడ్డల జాబితాలతో కొట్టివేసింది.ఆత్రుతతో స్టాలుకు పరువేత్తాను ఆలస్యం జరిగినా ఆ పుస్తకం నాకు దక్కదేమో నని భయపడ్డాను.నాకోసం అది అక్కడేవున్నందుకు ఆనందపడ్డాను.
కొన్నాళ్ళకు నాతొలి రచన పత్రికలో వెలువడింది.దానిలో పేదవాళ్ళ కష్టాలను గుండెలు తరుక్కుపొయేలా చిత్రించాను.ఎంతో మంది మిత్రులు నా ప్రతిభను కొనియాడారు.ఆ పత్రికా సంపాదకుడు నన్ను శ్లాఘిస్తూ "మీరు ప్రత్యేకం మా పత్రికకు రచనలిస్తువుండండి .తగిన ప్రతిఫలం ముట్ట చెప్పటానికి మా అధికారిని వొప్పించాను "అంటూ లేఖ వ్రాసాడు.
సర్వశక్తులనీ బలికొంటున్న గుమాస్తా నౌకరీకి ఆనాడే రాజీనామా పెట్తి ,సాహిత్య సేవకు పూనుకున్నాను కొద్దిరోజులలోనే సాహిత్య గగనాస ఉజ్వలతారగా ప్రకాశించాను.పత్రికా రచయితగా వుంటునే గ్రంధకర్తనయ్యాను .పాఠకలోకం నా గ్రంధాలకు మంచి ఆదరణచూపింది.ప్రతి సంపుటీ లక్షల తరవడి ప్రతుల ఖర్చు అయినాయి -తత్కారణంగా పేదరికం నుండి ధనికుడిగా మారిపోయాను ఈనాడు డబ్బుతో లభించే సర్వసుఖాలు అందుబాటులొ ఉన్నాయి.నా భోజన పళ్లేరంలో విలువైన పదార్ధలు వుంటున్నవి.కాని ఏ ఒక్కటీ రుచించదు.పుస్తకాలు కొనిచదవాలి అనేకాంక్ష పోయినది.అయినా ఎవరో ఒకరు వారి వారి గ్రంధాలనునాకంపి నా అభిప్రాయం తెలుపవలసినదిగా కోరతారు .వాటిని చదివే ఓపిక తీరికా నాకు లేకుండా పోయింది.చదవకుండానే కొందరికి మీ గ్రంధం బాగున్నదని లేఖలు వ్రాసేవాణ్ణి మరికొందరికి అదీ లేదు .
ఇప్పుడు ప్రతి నాటకానికి సినిమాకి మొదటి తరగతిలో హజరవుతాను.కాని పేదరికంలో నా చెల్లితొ కలిసి చివరి తరగతిలో కూచుని శ్రద్దగా చూసినట్లు చుడలేకపోతున్నాను.ప్రతి విషయంలోను నా స్థితి ఇలానే వుంటోంది .
ఇంతకాలమయాక నా జీవితానుభవంలో గుర్తించిన సత్యమేమిటంటే-"ధనవంతుడికి అన్ని సౌఖ్యాలు ఉన్నాయి .కాని వాళ్ల సౌఖ్యాలలో ఆనందం లేదు.పైగా ఆ జీవితం అశాంతికి ఆలవాలం.పేదరికపు కష్టాలలో శాంతి,ఆనందం తొనికిసలాడుతోంటై అని.ఏమంటారు ??
You Says:
As green and fresh as you
Reflects as pure as your heart
Why not we build this broken bridge
and make our home and live
Image source: Google
© Blogger template Blogger Theme by Ourblogtemplates.com 2008
Back to TOP