Thursday, May 28, 2009

వీర సావర్కర్ 126వ జయంతి (చరిత్రలో ఈ రోజు)



వీర సావర్కర్ 126వ జయంతి ని పురస్కరించుకుని ఒకసారి ఆ వీరుడి జీవితం గురించి ఙ్ఞాపకం చేసుకుందాం.

అకుంఠిత దీక్ష, పట్టుదల ఆయన ముఖ్య గుణాలు.
చపేకర్ సోదరుల ఉరితీత పై ఆగ్రహించి , యుక్త వయసులో ఉన్న సావర్కర్ తమ ఇలవేల్పు ఎదుట ఒక ధృడ నిర్ణయం తీసుకున్నాడు. విదేశీయుల చెరలో ఉన్న భరతమాతను విడిపించేదాక సమరం జరుపుతానని, మృత్యువు ఎదురైన వెనుకంజ వేయనని తీసుకున్న ఆ శపధం కి గొప్ప మనో సంకల్పాన్ని ఇచ్చినది.అతని కార్యదీక్ష ముందర ఏ సమస్యలు అడ్డులు అవాంతరాలు కాలేకపోయాయి.

13 మార్చి 1910 న లండన్ లో విక్టోరియా రైల్వే స్టేషను వద్ద పారిస్ నుంచి వచ్చి ట్రైను దిగుతూ సవార్కర్ "Fugitive Offenders' Act 1881" కింద అరెస్టు అయ్యాడు.భారతదేశం లో చట్టవ్యతిరేకం గా ప్రజలను రెచ్చగొట్టి చంపడానికి ప్రేరేపించారని సవార్కర్ పై అభియోగాలు నమోదు అయ్యాయి.బెయిలు నిరాకరించి జైలు కి పంపారు.సవార్కర్ ఈ అరెస్టు, జైలు శిక్ష, బహుశా మృత్యుశిక్ష ముందే ఊహించిగలిగినా ధైర్యం గా వచ్చాడు.రావడం వలన పరిణామాలు తెలిసినా ఎందుకు వచ్చావ్ అని నిరంజన్ పాల్ అతనిని ప్రశ్నించినప్పుడు సవార్కర్ ఈ విధం గా జవాబు ఇచ్చాడు. లండన్ నెను అరెస్టు అవదానికే వచ్చాను,పరిణామలకి నేను సిద్దం అని.మరి అతని వద్ద రెండే మార్గాలు ఉన్నాయి. ప్రాణాలకై ప్రయాణం లేదా ఉరికంబం.

సవార్కర్ జీవితం అన్ని విధాలుగా అతలాకుతలమే అయినది.అంతకు ముందర సంవత్సరమే అతని అన్నగారికి అందమాను లో జీవితఖైదు విధించారు.అతని తమ్ముడు నారయణ రావు సైతం అరెస్టు అవబడ్డాడు.ఇంటి భాద్యతలు అన్ని సవార్కర్ వదినగారైన యెసువాహిని పైన,సవార్కర్ భార్య యమునాబాయి(మాయి) పైన పడ్డాయి.సవార్కర్ ఒక్కగానొక్క కొడుకు ప్రభాకర్ స్వాతంత్రోద్యమం అనే తుఫాను యొక్క జ్వాలా మేఘాలలో బలి అయిపోయాడని సవార్కరే ఒక హృదయ విదారకమైన కవితలో పేర్కొన్నాడు.అతని స్థిరాస్థులన్ని ప్రభుత్వాధీనంలోకి వెళిపోయే పరిస్థితి ఏర్పడింది.ఇవి ఇలా ఉండగా స్వాతంత్రోద్యమం లో 17 ఆగస్టు 1909 న అతని ప్రియ సహచరుడు మదన్ లాల్ ఢింగ్రా ధైర్యం గా ఉరికంబానికి వెళ్ళాడు.అతని స్వాతంత్రోద్యమ సంస్థ "అభినవ్ భారత్" శిథిలావస్థ కి చేరింది.సవార్కర్ జైలు లో ఉండగానే ఇంకో దుర్వార్త విన్నాడు-నాసిక్ జిల్లా కలెక్టరు ఐన జాక్సన్ ని హత్య చేసినందుకు గాను అనంత్ కర్హేరే,కార్వే,దేష్పాండేలను ఉరితీశారని .

ఇటువంటి దయనీయమైన స్థితి లో కూడా సవార్కర్ సంకల్పం ఎక్కడా చెదరలేదు.అతనికి అప్పటికి ఇంకా వ్రాయడము, చదవడము నిషేదించలేదు."మాఝే మృత్యుపత్ర" అనే ఒక కవిత/గీతం, తను గౌరవించే వదినగారి పేరిట వ్రాశాడు.
25 శ్లోకాలు ఉన్న ఆ అమర గీతం, ఒక వైశాఖ మాసాన తనవంటి మనోదృక్పధం ఉన్నవారిని ఎలా ఒకచోట చేర్చాడో వ్రాస్తూ మొదలుబెట్టి, వదినగారి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కూడ అందులో స్తుతించాడు.తాను, తన అనుచరులు బాజి ప్రభు (శివాజి ని కాపాడి తన ప్రాణాలర్పించిన వీర యోధుదు) చూపించిన మార్గం లో నడుస్తామని ప్రతిఙ్ఞ చేసామని కూడా పేర్కొన్నాడు.దేశంపట్ల తనకు ఉన్న అంకితభావన్ని కూడా ఈ విధంగా అతను వ్యక్తపరిచాడు.

"హే మాతృభూమి! తుజలా మన్ వహియేలే,
వక్తృత్వ వాగ్విభావ్హి తుజ ఆర్పియాలే
తూతేచి అర్పిలి నవి కవిత రసాలా
లేఖాప్రతి విషయ్ తూచి అనన్య జ్హల"

{"Hey matrubhumi! tujalaa man vahiyele,
vaktrutva vagvibhavhi tuja arpiyale
tootechi arpili navi kavita rasaalaa
lekhaaprati vishay toochi ananya zhala" }

[("Oh Motherland! I have dedicated my intellect to you,
To you I have dedicated my oratory,
To you I have dedicated my new poem,
You have become the sole subject of my prose") ]

చిట్టోడ్ లో పార్వతి,పద్మినిల ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ యెసువాహిని అసామాన్య ధైర్యసాహసాలని ఈ విధం గా కొనియాడాడు.

"తే దివ్య అబలా-బలా తేజ్ కాహి
అజుని యా భరత్ భుమిత్ లుప్త్ నాహి"

{"Te divya abalaa-bala tej kaahi
ajuni yaa bharatbhumit lupt naahi" }

(That luminous feminine strength
hath not yet disappeared from Bharatbhumi")

తన అసమాన నాయకత్వ ధోరణి లో ఈ అమర వాక్యాలను రచించాడు.

"కి ఘేతాలే వ్రత్ న హే అమ్హి అంధతేనే
లబ్ధ ప్రకాష్ నిసర్గ-మానే
ఝెయ్ దివ్య దాహక్ మ్హాన్నుని అసావయాచే
బుద్ధ్యాచి ఘెతలే వాన్ కరి హే సతిచెయ్"

{"Ki ghetaley vrat na hey amhi andhatene
labdha prakash nisarga-maane
Jey divya daahak mhannuni asaavayaache
Buddhyaachi ghetaley vaan kari hey satichey" }

[Blindly have we not made this resolve
But in the light of history and the laws of nature
Whatever is luminous and scorching
Have we purposefully held the robes of a sati in our hands"]

మృత్యువు సైతం సవార్కర్ జోలికి రావడానికి భయపడింది.మృత్యువుని జయించి అమరుడయ్యాడు.అతనిలోని ఆ దీక్ష పట్టుదల అంకిత భావం మనందరికి కొంచం అయినా రావలి అని కోరుకుంటూ ...స్వాతంత్ర వీరుడు మన వీర్ సావర్కర్ అమర్ రహే.
వీర్ సావర్కర్ అమర్ రహే!!
జై హింద్.

visit : http://www.savarkar.org/en/veer-savarkar

2 comments:

Anonymous,  11:02 PM, May 28, 2009  

All of us are indebted to these heroes.
Savarkar amar rahe!

~!

Vani 11:57 PM, May 28, 2009  

thanks for sharing this..

  © Blogger template Blogger Theme by Ourblogtemplates.com 2008

Back to TOP