బృందావనంలో పారిజాతం
డెబ్భయ్ వసంతాల కిందట
ఉదయించిన ఒక అరుణ కిరణం
తొమ్మిది యేండ్లకు పుట్టిల్లు వదిలిన
ఆమె బాల్యం
అత్తారిల్లే నేటికి అవిడకు వైకుంఠం
చెదరని అవిడ మనోధైర్యం
కదిలిస్తుంది నా అంతరంగం
మా అందకిరి ఆమె అభయ హస్తం
మకరందాలతో పోటీపడే
ఆమె మమకారం
అమృతాల ఆప్యాయతను పంచే
చిరునవ్వు ఆమెకే సొంతం
గుడిమెట్టు ఎక్కని ఆవిడ నాస్తికత్వం
పనిపాటలే సర్వస్వం అనే ఆమె మానవత్వం
చాలా మందికి విచిత్రం
వంటవార్పులే ఆమెకి కాలక్షేపం
ప్రతి రోజు ఇంట పంచభక్షప్రమాన్నం
వచ్చేపొయే వాళ్ళకి మహాప్రసాదం
ఎమిటో యి రోజు నాలో భావోద్రేకం
బోర్లా పడిన నేలని వదిలి వచ్చిన
నా యాంత్రిక జీవనం
పరిగెత్తుకొని పోలేని యీ మైళ్ళ దూరం
ఎదో ఇవ్వాలన్న నా తాపత్రయం
ఏమి ఇచ్చినా తీర్చుకోలేని ఆమె రుణం
కలవర పెట్టకుండా ఆమె ఆరోగ్యం
భగవంతుడు ఇవ్వాలి మాకు మరింత ధైర్యం
ఎందుకంటే
ఆమె మా బృందావనంలో పారిజాతం
ఓ సీతమ్మా..... (అమ్ముమ్మా)
నా(మా)మనసులనిండా నీ ఙ్ఞాపకాలు పదిలం
***
Today's Picture:
నేత చీరల అందం చేనేత పని వారి శ్రమ అమితం
***
Today's Song:
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే?
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
గోపికా స్త్రీలంతా నీళ్ళకెళ్ళంగా
వెనకాల కృష్ణుడొచ్చి కళ్ళు మూసెనే
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే?
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించెనే?
కొట్ట బోతె చిన్ని కృష్ణుడెందు బోయెనే?
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే?
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
కాళింది మడుగులోన కడిగేవాడమ్మా
బాలుడు కాదమ్మ పెద్ద వాడమ్మా
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే?
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
చీరలన్ని మూటకట్టి చిన్ని కృష్ణుడు
పొన్నుమాను మీద పెట్టి పంతమాడెనే
ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెనే?
మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెనే
3 comments:
Well written poem...
aa krishnuDi kavita evaru raasaaru?
intaki tamarevarO selavistee aanandistaamanDi...
u seem to be a telugu NRI too...
Hi Yoga-
Thanks for ur input :)
i don't know who wrote those lines about lord krishna.
acutally,i thought it is a kOlaaTam song.
just now i checked with my grand ma, she told me it is a gobbi paaTa &she also don't know about the writer:(
and yup i am also a telugu NRI.
Oh ok. yeah the folk songs and ballads are too good...simple and mellifluous and no one knows who wrote it!...
Anyways, I wrote a new one yesterday...
Unable to post in my regular blog. So, posted in my LJ...
Lemme know your comments...
if you have time.
http://www.livejournal.com/users/yoganand/12634.html
Post a Comment