Wednesday, September 28, 2005

ప్రముఖుల హాస్యోక్తులు

నా తాత ముత్తాతల కాలం నాటి ప్రముఖుల హాస్యోక్తులు నేను చూసినవి విన్నవి కావు
పోని నా తతాలు దగ్గర అన్న సాహిత్య ఘోష్ఠి లలో వున్నానా అంటే
సెలవలో కూడా వచ్చే సంత్సరం మొదటి unit test నుండి first rankలు రావలి కదా
అందువల్ల అది కూడా జరగలేదు.

కాని తెలుగు సాహిత్యం 'ఎమిటో' వుంది దాని చదవాలి అని మొదలు పెట్టాక ఎమిటొ కాదు
'ఎంతో' వుంది అనిపిస్తుంది అది వేరే విషయం అనుకోండి

ఇంత ఉపోద్ఘాతము ఎందుకు ఆంటార ఇప్పుడు రాయ బోతున్నవై అన్ని స్వీయమైనవి కాదు,
ఒక రచయిత్రి తన ముందు మాటలో పేర్కొన్నట్టు యివి అన్ని పెద్ద font size లో "ట"
అని పెట్టుకోని చదువుకోవాలి సుమి.

అబ్బురి చమత్కారం,విశ్వనాధ వ్యంగ్యం,కట్టమంచి వెటకారం,చలం హాస్యం,శ్రీ శ్రీ వేళాకోళం ఇలా చాలా మంచి అరోగ్యకరమైన చలోక్తులు లో కొన్ని...

విశ్వనాధ వారి గాడిద జోకు

విశ్వనాధ వారు బందరులో వున్నప్పుడు ఒకాయన కొత్తగా వచ్చారుట.బందరు పట్టణం లో గాడిదల సంఖ్య ఎక్కువగా వున్నట్టు వుంది తోచి "ఏమండి మీ బందరులో గాడిదలు ఎక్కువల్లే వుందే "అన్నదు
సమాధానం గా విశ్వనాధ "అబ్బే ఇక్కడివి తక్కువేనండి బయటనుంచి వచ్చేవే ఎక్కువ " అన్నారు ట .

**

ఒకసారి జ్వరం తో మంచంలో వున్న "దుగ్గిరాల" వారిని పరామర్శించటానికి వెల్లిన
"దువ్వూరి సుబ్బమ్మ గారు" ఆయన్ను పలకరించి "జ్వరం ఎక్కువగా వుందా" అని అయన
చెయ్యిపట్టుకోని చుస్తుండగా
"అసలే జ్వరం తో బాధ పడుతువుంటే పైగా పాణిగ్రహణం కూడానా?" అని చలోక్తి గ అన్నారుట అంధ్రా రత్న

**

మల్ల వరపు విశ్వేశ్వర రావు గారి మధుకిల్లా కావ్యానికి ము౦దు మాట లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇలా రాసారు

నీ రచనలు అన్ని పుస్తకరూపం లో రావాలయ్యా
నువ్వు కవివయ్యా
నేను ఎవరితోను ఇట్లా అనను
విశ్వేశ్వరరావు నిజం గా కవి

యి పంక్తులు చదివాకా సాహిత్య విదుషకిడిగా ప్రసిద్ధి కెక్కిన "జలసూత్రం రుక్మిణీ నాధ శాస్త్రి "చేసిన పేరడీ

సుబ్బారావు
నువ్వింక క్షవరం చేయించుకొవాలయ్య
నీ తల మాసిందయ్య
నేను ఎవరితోటి ఇట్లా అనను
సుబ్బారావు నిజంగా తలమాసిన వాడు
**

శ్రీ శ్రీ మహా ప్రస్థానం కి చలం యోగ్యతా పత్రం శీర్షికలో ముందు మాట రాసిన విషయం తెలిసదే ఆ యోగ్యతాపత్రం చాలా విలువైనది అని శ్రీ శ్రీ భావించినా ఒక interview లో "పిచ్చి రెడ్డి " అనే student అడిగిన ప్రశ్న &శ్రీ శ్రీ సమాధానం
Q : యోగ్యతాపత్రం చదివితే మహా ప్రస్థానం గీతాలు మరి చదవక్కరలేదు అనుకుంటా.దానికి మీరు ఎమి అంటారు?
Ans : మీరు సార్ధక నామధేయులు అంటాను.

**

SVR CVR college లో ఒక సారి principal Staff మీటింగు పెట్టి యి రోజు ఒకే సారి రెండు నెలల జీతాలు ఇస్తారు తీసుకొని వెళ్ళండి అనంగానే ఆంగ్ల బాషాధిపతి అయిన శ్రీ శాస్త్రి గారు Good news Good news అని కేరింతలు కొడుతుంటే అదే సమయంలో "విశ్వనాధ"వారు ఆడుగు పెడుతూ what is the good news of the that good news Mr.Sastry అనంగానే అతడు విషయం చెప్పగా "ఎవరయ్యా నీకు M. A english degree ఇచ్చినవాడు?degree of comparision తెలియని వానికి?

ఒక నెల అయితే good అనాలి రెండు నెలలు అయితే better అనాలి మూడు నెలలు అయితే best అనాలి కదా ఇలాగే చెపుతున్నావా పిల్లలలి పాఠాలు? అని చలోక్తి విసిరారు ట.

**
ఆంగ్ల శబ్ధ విన్యాసాలు చేయడం "కట్టమంచి" వారికి కరతలామలకం.ఒకసారి మద్రాసు railway station లో రైలు దిగుతుండగా ఒక పత్రికా విలేఖరి దూసుకోని వచ్చడు త వెంటనే reddy గారు "నాకిప్పుడు 'రిపొర్టరూ తో పని లేదు 'పోర్టరూ కావాలి అన్నారుట
**

Today's Picture :




సిరులొలికే చిన్నరీ
కల్లలెరుగని ఓ బుజ్జాయి
నీ మోము లో అమాయకత్వమోయి
కదిలించలేదు మీ అమ్మనోయి

0 comments:

  © Blogger template Blogger Theme by Ourblogtemplates.com 2008

Back to TOP